ఈవీఎంలను పరిశీలించిన ఎంపీడీఓ..


Ens Balu
5
Rowthulapudi
2021-09-02 03:51:57

రౌతులపూడి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించినట్టు ఎంపీడీఓ ఎస్వీనాయుడు తెలియజేశారు. బుధవారం ఈ మేరకు సామల్ కోట లోని స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి అక్కడ గదులకు సీళ్లు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ లను పరిశీంచి భద్రతను తనిఖీ చేసినట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో నిత్యం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్నప్పటికీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు.
సిఫార్సు