థర్ఢ్ వేవ్ కరోనాను ద్రుష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు కరోనా వేక్సిన్ వేయించుకోవాలని ఎంఈఓ ఎస్వీరమణ సూచించారు. బుధవారం శంఖవరంలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మండలంలోని 46 ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆదేశాలు జారీచేశామన్నారు. కొందరు మొదటి డోసు వేసుకుని, రెండ డోసుకి సిద్ధంగా ఉన్నవారిని కూడా వేక్సిన్లు వేయించుకోవాలని సూచించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీపాఠశాలలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు చెప్పిన ఎంఈఓ అత్యవసర సమయంలో పాఠశాలల్లో బ్లీచింగ్ చల్లించే ఏర్పాటు కూడా చేస్తున్నామన్నారు. పిల్లలను కూడా దూరం దూరంగానే కూర్చోబెట్టాలనే నిబంధనను కూడా అమలు చేస్తున్నట్టు ఆయన వివరించారు.