పౌష్టికాహార స్వీకారంతోనే మెరుగైన ఆరోగ్యం..


Ens Balu
2
విశాఖసిటీ
2021-09-02 04:41:48

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు కడుపులో పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుందని ౌ ఐసిడిఎస్ విశాఖ అర్బన్-2 సిడిపీఓ శ్రీలత అన్నారు. విశాఖలోని క్రాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల తల్లులంతా పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే బలవర్ధక ఆహారం తీసుకోవడంతోపాటు, నిత్యం, పాలు, ఆకుకూరలు, పప్పు, గ్రుడ్లు అధికంగా తీసుకోవాలన్నారు. ఏఏ ఆహారాల్లో పోషక విలువలు ఉంటాయో అంగన్వాడీ కేంద్రాల్లోని కార్యకర్తల ద్వారా తెలుసుకొని పాటించడం ద్వారా తల్లుల ఆరోగ్యంతోపాటు, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే బాలమ్రుతం పెట్టడం ద్వారా పిల్లలు ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రంలో  విశాఖ అర్బన్-2 సూపర్ వైజర్ సుసీల, అంగన్వాడీ కార్యకర్త దాక్షాయని, అధిక సంఖ్యలో పిల్లల తల్లిదండ్రలు పాల్గొన్నారు.
సిఫార్సు