విశాఖజిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రేవుపోలవరం తీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను గ్రామ యువకులు శుభ్రం చేశారు. బుధవారం తీరంలో ఫాస్టిక్ వ్యర్థాలు,మద్యం సీసాలు,వివిధ వ్యర్థాలను శ్రమదానం చేసి ఏరివేశారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే తీరాన్ని శుభ్రపరచాల్సిన అవసరం ఎంతైన ఉందని, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని యువకులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యాటక ప్రదేశాలను అభివ్రుద్ధి చేయడం ద్వారా జిల్లాకు మంచి పేరు వస్తుందన్నారు. అదేసమయంలో ఇలాంటి ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని.. ప్రజాప్రతినిధులు స్పందించకపోతే యువతే తమ సొంత నిధులతో సముద్ర తీరాన్ని శుభ్రపరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతకాయల బంగ్రారాజు, యజ్జల బంగారు చిట్టి,దూడ నూకరాజు,చోడిపల్లి గజిని,గనగళ్ళ శ్రీను,సూరాడ ధనరాజు, గరికిన గోవిందు,చోడిపల్లి రాజు,చోడిపల్లి మహేంద్ర తదితరలు పాల్గొన్నారు.