శంఖవరంలో ఉత్సాహంగా పౌష్టికాహార ర్యాలీ..
Ens Balu
4
Sankhavaram
2021-09-02 14:38:51
పౌష్టికాహారంపై అందరూ అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అంగన్వాడీ కార్యకర్త బుల్లెమ్మ అన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని అంగన్వాడీ-2 కేంద్రం పరిధిలో పౌష్టికాహారా మాసోత్సవవాల సందర్భంగా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కేంద్రం పరిధిలో అవగాహన కల్పించారు. అనంతరం కార్యకర్త మాట్లాడుతూ, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఆస్కారం వుంటుందన్నారు. అదేవిధంగా కడుపులో పెరిగే పిల్లల ఎదుగుల చక్కగా వుంటుందన్నారు. అంతకుముందు చిన్నారులతో పౌష్టికాహారానికి సంబందించిన కూరగాయలు, పప్పు, పాలు, ఇతర దినుసుల పేర్లు చెబుతూ తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, చిన్నారులు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.