శంఖవరం మండలంలో త్వరిత గతిన పోలింగ్ స్టేషన్లు మ్యాపింగ్ జరుగుతుందని తహశీల్దార్ కె.సుబ్రమణ్యం తెలియజేశారు. ఆయన శుక్రవారం శంఖవరం తహశీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో 49 పోలింగ్ స్టేషన్లకు గాను 23 స్టేషన్లు మ్యాపింగ్ జరిగిందన్నారు. 41 మంది బిఎల్వోలు ప్రొఫైల్ అప్లోడ్ చేశారన్నారు. మండలంలో రెండు ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్ లేని చోట్ల ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు జరగలేదన్నారు. కొందరు బిఎల్వోల దగ్గర గరుడాయాప్ మ్యాపింగ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాటిని జిల్లా అధికారులకు నివేదించినట్టు తహశీల్దార్ వివరించారు.