మండలంలో 112 టన్నులు వ్యవసాయ ఎరువులు..
Ens Balu
3
Rowthulapudi
2021-09-03 08:39:29
రౌతులపూడి మండలంలో 112 టన్నులు ఎరువులు సిద్దంగా ఉన్నాయని వ్యవసాయాధికారి పడాల గాంధి తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు మండలానికి పూర్తిగా ఎరువులు కేటాయించిందన్నారు. రైతుభరోసా కేంద్రాల పరిధిలోని రైతులకు, గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా వీటిని అందజేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఎరువులు చేరిన విషయాన్ని పొలంబడి కార్యక్రమంలో కూడా రైతులకు తెలియజేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. కావాల్సిన నాణ్యమైన ఎరువులను రైతుభరోసా కేంద్రాల నుంచి కొనుగోలు చేసుకోవచ్చునని వ్యవసాయాధికారి తెలియజేశారు.