90శాతం పూర్తైన 5 రైతు భరోసాకేంద్రాలు..
Ens Balu
3
Rowthulapudi
2021-09-03 09:39:03
రౌతులపూడి మండలంలో మరో 5 రైతుభరోసా కేంద్రాలు 90శాతం నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయని అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గోపీనాధ్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం రౌతులపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 17 ఆర్బీకేలు మంజూరు కాగా ఇప్పటికే ఒకటి ప్రారంభం అయ్యిందన్నారు. మరో 5 త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. నిర్మాణాలు పూర్తైపోయి రంగులు వేసే దశలో ఉన్నాయన్నారు. ఈనెలాఖరుకు వీటిని ప్రారంభించే అవకాశం వుందని ఆయన వివరించారు. మిగిలిన ఆర్బీకేలు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు.