జ్వరాల నింత్రణకు దోమలపై దండయాత్ర ..
Ens Balu
4
Visakhapatnam
2021-09-03 13:04:44
మహా విశాఖ నగర పరిధిలో దోమలను నివారించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని జివిఎంసి కమీషనర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. శుక్రవారం ఈ విషయమై విశాఖలో ఆమె మాట్లాడుతూ, నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా దోమల నివారణే ప్రధాన ధ్యేయంగా అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. ప్రతీ రోజూ జివిఎంసి ఇంటింటా సర్వేనిర్వహిస్తున్నామరు. ఈసీజనల్ వ్యాధులు విస్తృతం కాకుండా ముందస్తు చర్యలైన పరిసరాల పరిశుభ్రత ద్వారా ప్రతీ ఇంటా దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తుంచి నివారణ ప్రారంభిస్తామన్నారు. ఈ చర్యలలో సంబందిత అధికారులు, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, మలేరియా సిబ్బంది ద్వారా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు తమవంతు బాధ్యతగా జివిఎంసి సిబ్బందికి సహకరిస్తూ, ప్రతీ శుక్రవారం “డ్రై డే” ను విధిగా పాటించి దోమల నివారణ చర్యలకు బాధ్యత వహించాలని కమిషనర్ కోరారు. ముఖ్యంగా మంచినీటి నిల్వలలోనే దొమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయని ప్రజలు గమనించాలన్నారు. వారానికొకసారి తప్పనిసరిగా వాటర్ ట్యాంకులలో నీటి నిల్వలను ఖాళీ చేసి, ఆరబెట్టి తాజాగా నీటిని నింపుకోవాలని కమిషనర్ తెలిపారు.