శంఖవరంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
Ens Balu
1
Sankhavaram
2020-09-09 18:38:43
శంఖవరం మండలకేంద్రంలో ఈ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. మంగ ళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిం చినట్టు ఆయన వివరించారు. మొత్తం 72 మందికి స్వాబ్ ర్యాపిడ్ టెస్టులు చేయగా అందులో 10 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో విపరీతంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ జె.రాంబాబు, తహశీల్దార్, సుబ్రమణ్యం, మూడు గ్రామసచివాలయాలకు చెందిన కార్యదర్శిలతో పాటు ఇతర అధికారులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.