ఈవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్..
Ens Balu
3
Nellimarla
2021-09-04 05:57:16
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి శనివారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీళ్లను పరిశీలించారు. గోదాములకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఎంపిడిఓ రాజ్‌కుమార్, తాశీల్దార్ కెవి రమణరాజు, ఎలక్షన్ సూపరింటిండెంట్ భాస్కరరావు, ఎలక్షన్ డిటి డి.శైలజ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సముద్రాల రామారావు, సిపిఐ నాయకులు తాలాడ సన్నిబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.