పారిశుధ్యంపై ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలి..


Ens Balu
3
Yeleswaram
2021-09-04 08:18:30

డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు ప్రస్తుతం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామసచివాలయ, పంచాయతీ కార్యదర్శిలు పారిశుధ్యంపై ద్రుష్టి సారించాలని ఎంపీడీఓ గోవిందు సూచించారు. ఈమేరకు శనివారం ఏలేశ్వరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఆయన కార్యదర్శిలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. సచివాలయాల్లోని వాలంటీర్ల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా జ్వరాలున్న వారి ఇళ్లదగ్గర కూడా బ్లీచింగ్ చైన్ వేయించడంతోపాటు, వారంలో రెండు రోజులు డ్రైడే పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జ్వరాలు వచ్చిన వారి వివరాలను వైద్యసిబ్బందికి తెలియజేయాలన్నారు. పీహెచ్సీకి తరలించి వైద్య పరీక్షలు, రక్తపరీక్షలు చేయించాలని ఆదేశించినట్టు ఎంపీడీఓ గోవింద్  పేర్కొన్నారు.

సిఫార్సు