జగనన్న గోరుముద్ద నాణ్యతలో తేడా రాకూడదు..
Ens Balu
3
Rowthulapudi
2021-09-04 08:48:48
ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్నాం పథకం ద్వారా అందించే భోజనం(జనగనన్న గోరుముద్ద)లో నాణ్యత తగ్గడానికి వీల్లేదని ఎంపీడీఓ ఎస్వీనాయుడు నిర్వాహకులకు సూచించారు. శనివారం రౌతులపూడి హైస్కులో భోజనాలను పరిశీలించి స్వయంగా రుచిచూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్ధుల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని పాఠశాలలోనే మధ్యాహ్నాం భోజనం అందిస్తున్నదన్నారు. దానికోసం నిర్వాహకులు మెనూ ప్రకారం సుచిగా, రుచిగా భోజనాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వాసిరెడ్డి భాస్కరబాబు తదితరులు కూడా పాల్గొని విద్యార్ధులకు పెట్టే భోజనాన్ని రుచిచూసి సంత్రుప్తి వ్యక్తం చేశారు.