ప్రొబేషనరీ పరీక్షకు శిక్షణ ఎంతో దోహదం..


Ens Balu
7
Prathipadu
2021-09-04 09:20:26

గ్రామసచివాలయాల మహిళాపోలీసులకు సర్వీస్ రెగ్యులైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే శిక్షణ ఆన్ లైన్ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు చెప్పారు. శనివారం ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలోని గ్రామసచివాలయ మహిళా పోలీసులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొని వివిధ నేరాలకు సంబంధించి ఏఏ సెక్షన్ లు వినియోగించాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా పోలీసులు గ్రామ సంరక్షణలో కీలకంగా వ్యవహరించాలన్నారు. అన్ని విషయాలపైనా అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్టోబరు 2 నాటికి మహిళా పోలీసులంతా ప్రొబేషనరీకి సంబంధించిన ప్రత్యేకక ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి ఇలాంటి శిక్షణలోని అంశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సర్కిల్ లోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు.
సిఫార్సు