సస్యరక్షణపై అవగాహన కల్పించండి..
Ens Balu
2
Rowthulapudi
2021-09-04 11:39:53
రైతులకు సమగ్ర సస్య రక్షణ పద్దతులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారి పి.గాంధీ సిబ్బందికి సూచించారు. వైఎస్సార్ పొలం బడి శిక్షణా కార్యక్రమంలో భాగంగా రౌతులపూడిలో వరి,ప్రత్తి పంటల్లో పంటపొలం పరిశీలన చేసేసాగు పద్దతులపై భౌతిక పద్దతులు,యాంత్రిక పద్ధతులు,జీవ నియంత్రణ పద్ధతులు,రసాయన విధానాల ఉపయోగం సిబ్బందికి అవగాహన కల్పించారు. తీసుకున్న శిక్షణను వినియోగంలో పెట్టి రైతు భరోసా కేంద్రం లో ఉన్న ఎరువులు, పురుగు మందుల వాడకం గూర్చి రైతులకు వివరించాలని తెలిపారు. అనంతరం బృంద విన్యాసం చేయించి ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో ఏఈఓ గోపి, సిబ్బంది సతీశ్,ఉమ,లహరి,మణికంఠ,మాధురి, రామకృష్ణ,ప్రసాద్,శేఖర్,చిన్ని,కిరణ్,శ్రీను,జగదీశ్,వీరేంద్ర,సన్యాసి రావు, వీర మణికంఠ తదితరులు పాల్గొన్నారు.