మా ప్రొబేషన్ పరీక్షకు గడువు పెంచండి సారూ..


Ens Balu
7
Sankhavaram
2021-09-04 16:19:38

గ్రామసచివాలయాల్లో పనిచేసే విద్యా, వెల్పేర్ అసిస్టెంట్లకు ప్రొబేషన్ డిక్లరేషన్ కు నిర్వహించే పరీక్షకు గడువు పెంచాలని కోరుతూ మండల సిబ్బంది ఎంపీడీఓకి శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు శంఖవరం ఎంపీడీఓ జె.రాంబాబును కలిసి సంక్షేమ కార్యదర్శిలు తమ గోడును వెల్లదీసుకున్నారు. సర్వీసు డిక్లరేషన్ కు సర్వీసు నిబంధనలు మార్చి ఇచ్చిన పరీక్ష తక్కువ సమయంలో పెట్టడం ద్వారా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు. తమకు కూడా మిగిలిన శాఖల సిబ్బంది మాదిరిగా మూడు దఫాల్లో డిపార్టమెంటల్ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కల్పించేలా జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళ్లాలని ఆ వినతి పత్రంలో ఎంపీడీఓని కోరారు. లేదంటే అందరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని 16 గ్రామసచివాలయాల పరిధిలోని  విద్యా, వెల్పేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సిఫార్సు