శంఖవరానికి 240 కోవిడ్ డోసులు..
Ens Balu
3
Sankhavaram
2021-09-05 10:31:36
శంఖవరం పరిధిలోని మూడు గ్రామసచివాలయాల్లోనూ సోమవారం కోవిడ్ వేక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవిసత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పీహెచ్సీ పరిధిలోని 7 ఆరోగ్య కార్తలు ఈ కోవిడ్ వేక్సినేషన్ క్యాంపులో పాల్గొంటారని, వారితోపాటు పీహెచ్సీలోనూ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో 150 కోవీషీల్డ్ డోసులు, 90 కోవాగ్జిన్ డోసులు జిల్లానుంచి కేటాయింపు జరిందన్నారు. 18ఏళ్లు నిండిన వారికి, మొదటిడోసు పూర్తయి84 రోజులు దాటిన వారికి 2వ వడోసు కూడా వేస్తారని డాక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.