పీహెచ్సీ వైద్యాధికారి సేవలు మరువలేనివి..


Ens Balu
3
2021-09-05 11:04:43

ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా.ఏవి.రమణ సేవలు మరువలేనివని ఎంపీడీఓ గోవింద్ కొనియాడారు. ఆదివారం ఏలేశ్వరం పీహెచ్సీలో వైద్యాధికారి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ,  డాక్టర్ ఏవి రమణ వైద్యులతోపాటు, ప్రభుత్వ సిబ్బందికి ఎంతో మంచి వైద్యసేవలు అందించేవారన్నారు. అలాంటి వ్యక్తి ఉద్యోగ విరమణ చేసి దూరమవుతున్నా సేవలు అందించాలని కోరారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రంలో ఆసుపత్రి సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సిఫార్సు