జగత్తులో గురువుని మించిన దైవంలేదు..


Ens Balu
5
Tuni
2021-09-05 13:01:36

ఈ జగత్తులో గురువుని మించిన దైవం లేదని రౌతులపూడి ఎంఈఓ ఎస్వీనాయుడు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం గురుపూజోత్సవం సందర్భంగా తుని కుమ్మరిలోవ తపోవనం స్వామీజీ నుంచి ఆశ్వీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి గురువులే వెన్నుముఖ అని, ఎందరో బావి విద్యార్ధులను తీర్చిదిద్దే అవకాశం ఈ ప్రపంచంలో ఒక్క గురువుకి మాత్రమే దక్కుతుందన్నారు. గురుపూజోత్సవం రోజున స్వామీజీని కలుసుకొని ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిఫార్సు