తుని గాయత్రీ కాలేజీలో గురుపూజోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఎంఈఓ ఎస్వీనాయుడు పాల్గొని గురువుయొక్క విశిష్టతను తెలియజేశారు. ప్రపచంలో గురువు స్థానం ఎవరికీ లేదని, అలాంటి గురు స్థానంలో ఉన్నవారంతా దివంగత సర్వేపల్లి రాధాక్రిష్ణను స్పూర్తిగా తీసుకొని దేశ సేవకై పనిచేయాలన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మూర్తి, ఇతర సిబ్బంది ఎంఈఓను ఘనంగా సర్మానించారు. ఈ కార్యక్రంలో కాలేజి అద్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.