టీకావేసుకోని వారినిగుర్తించి వేక్సిన్ వేయాలి..
Ens Balu
4
Sankhavaram
2021-09-06 14:13:21
కోవిడ్ టీకాలు ఇప్పటి వరకూ వేయించుకోని వారిని గుర్తించి అలాంటి వారికి వేక్సిన్ వేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు ఆరోగ్యసిబ్బందికి సూచించారు. సోమవారం శంఖవరం మండలంలోని సీతాయంపేట సచివాలయం పరిధిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రస్తుతం కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు రకాలు టీకాలు అందిస్తున్నందున. వాటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందించేందుకు కాస్త శ్రమించాలన్నారు. అన్నికోవిడ్ వేక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి మాత్రమే కేంద్రాని రావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యసిబ్బంది, ఆశ కార్యకర్తలుపాల్గొన్నారు.