పౌష్టికాహారంపై ప్రతీఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 104 వైద్యులు ఎస్ఎస్.రాజీవ్ కుమార్ అన్నారు. మంగళవారం అన్నవరం- కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా తల్లులకు, పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన పౌష్టికాహారాన్ని సర్పంచ్ కుమార్ రాజాతో కలిసి పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు ఈవారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కార్యదర్శి రాంబాబు, జూనియర్ అసిస్టెంట్ రమణమూర్తి, డిఈఓ సూర్యదుర్గ, పైలట్ ఈశ్వర్రావు, ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశ భద్రలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.