ఎస్.రాయవరం మండలంలోని కొరుప్రోలు 33/11కేవి సబ్ స్టేషన్ పరిధిలో సిబ్బంది లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మదరాసు ఫ్రావిన్సి సమయంలో ఏర్పాటైన తొలి సబ్ స్టేషన్ గా ప్రాచుర్యం పొందిన ఈ సబ్ స్టేషన్ 19495 మంది వినియోగదారులను.. 22 కిలోమీటర్ల 33 కేవి లైను, 143 కిలోమీటర్ల 11 కేవి లైన్లు కలిగి వున్నది. ఇంతటి సుధీర్ఝమైన లైన్లు కలిగిన సబ్ స్టేషన్ లో ఒక లైన్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు లైన్ మేన్ అసిస్టెంట్ లు, లైన్ మేన్ లు నాలుగు జూనియర్ లైన్ మేన్, ఒకరు వాచ్మెన్, స్వీపరు పోస్టులు ఖాళీగా వుండడంతో వున్న వారిపైనే పనిభారం ఎక్కువవుతున్నది. ఇటీవల జరిగిన జనరల్ బదిలీలలో కొంతమంది ఇక్కడనుండి వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్ళిపోయారు. వారి స్థానంలో కొత్తవారిని భర్తీ చేయకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. కొరుప్రోలు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నివాసమున్నప్పటికీ ఇక్కడ జే ఎల్ ఎమ్ గాని, ఏ ఎల్ ఎమ్ గాని లేకపోవడం శోచనీయం. ఈ విషయమై స్థానిక నాయకులు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ద్వారా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలిపి పోస్టులు భర్తీకి విన్నవించినా ప్రయోజనం శూన్యం. ఇప్పటికైన అధికారులు కొరుప్రోలు సబ్ స్టేషన్ పరిధిలో పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.