శంఖవరం పీహెచ్సీలో చిన్నపిల్లల వైద్యసేవలు..


Ens Balu
5
Sankhavaram
2021-09-08 06:40:58

శంఖవరం పీహెచ్సీలో చిన్నపిల్లలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని వైద్యాధికారి డా.ఆర్వీవిసత్యన్నారాయణ తెలియజేశారు. బుధవారం ఈ మేరకు ఆయన పీహెచ్సీలో మీడీయాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవలే చిన్నపిల్లల వైద్యనిపుణులు డా.గోదాదేవిని పీహెచ్సీలో నియమించిందని అన్నారు. ప్రసూతి కేసులు, చిన్నపిల్లలకు సంబంధించిన ప్రత్యేక ఓపీ ఇపుడు పీహెచ్సీలో జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సదుపాయాన్ని చిన్నపిల్లల తల్లులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ గోదాదేవి అందరికీ అందుబాటులోనే ఉంటారన్నారు. వాటితోపాటు, అన్ని రకాల రక్తపరీక్షలు చేయడానికి ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు, పూర్తిస్థాయి పారామెడికల సిబ్బంది కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చారని ఆయన వివరించారు.

సిఫార్సు