108లోనే ప్రసవం.. తల్లీ కవలపిల్లలు క్షేమం..
Ens Balu
7
Sankhavaram
2021-09-08 07:09:07
ఆ పండంటి కవల పిల్లలకు 108 అంబులెన్సే ఆసుపత్రి అయ్యింది.. మార్గమధ్యలోనే ఆ తల్లి సిబ్బంది సహకారంతో పురుడు పోసుకుంది. బుధవారం శంఖవరానికి చెందిన శివకోటి కోటి అనంతలక్ష్మి పురిటి నొప్పులతో 108 అంబులెన్సులో రౌతులపూడి సీహెచ్సీకి పురిటికోసం వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి తక్షణమే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీనితో అక్కడి నుంచి 108 అంబులెన్సు కాకినాడ బయలు దేరింది ఈ క్రమంలో తిమ్మాపురం చేరుకునే సరికి ఆ తల్లికి నొప్పులు అధికం కావడంతో 108 ప్రసవం అయ్యింది. అంబులెన్సులో ఉన్న ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఆశ జక్కల సూర్యకాంతం ఆమెకు సురక్షితంగా పురుడుపోశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని అంబులెన్సు సిబ్బంది తెలియజేశారు. వారికి కాకినాడ జిజిహెచ్ లో చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య సిబ్బంది వివరించారు. తల్లీ బిడ్లను కాపాడిందును పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ ఆరోగ్య సిబ్బందిని అభినందించారు.