ప్రచారంతో జ్వరాలపై అవగాహన పెంచాలి..


Ens Balu
2
శంఖవరం
2021-09-08 13:45:14

డెంగ్యూ, మలేరియా జ్వరాలపై ప్రచారంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎంపీడీఓ జె.రాంబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం శంఖవరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రచార రధాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు అధికంగా ఉన్నందున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మైకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ వర్షాకాలం మొత్తం ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఎవరికి ఎలాంటి జ్వర లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీకి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, వారంలో రెండు రోజులు డ్రైడే పాటించాలన్నారు. చుట్టుప్రక్కల కొబ్బరిబొండాలు, టైర్లు, ఇతర వస్తువులు కుప్పలుగా లేకుండా ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు, సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు