డెంగ్యూ, మలేరియా జ్వరాలు అధికంగా ప్రభలుతున్న తరుణంలో ఆయుష్ శాఖ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం శంఖవరంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎపడమిక్ సీజన్ లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా హోమిపతి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా హోమియో వైద్య విధానం కూడా ప్రజలకు అలవాటు అవుతుందన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారికి హోమియోపతి మందులు, వైద్యసేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగదీశ్వరరావు, డాక్టర్, చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు పర్వత రాజబాబు, సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, ఉదయభాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.