పర్యావరణనాన్ని కాపాడటం కోసం ప్రతీ ఒక్కరూ వినాయకచవితి పండుగలో మట్టి ప్రతిమలనే వినియోగించాలని సామాజిక కార్యకర్త విజినిగిరి బాలభానుమూర్తి పిలుపునిచ్చారు. గురువారం సింహాచలం గిరిజన కాలనీలో గిరిజనులకు ఆయన మట్టి వినాయక ప్రతిమలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితిని అందరూ ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావడానికి బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లేటపుడు తప్పని సరిగా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె.వి.సంతోష్ తదిరులు ఫాల్గొన్నారు.