ఈనెల15 న పెదవలసలో మెగా వైద్య శిబిరం..
Ens Balu
3
Paderu
2021-09-11 06:03:34
గూడెం కొత్తవీధి మండలం, పెదవలసలో ఈ నెల 15నమెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలక్రిష్ణ శని వారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఆరోగ్య శ్రీ , ఐటీడీఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో నాణ్యమైన వైద్యం అందించి ఉచితంగా మందులు సరఫరా చేస్తారని చెప్పారు. మండలంలోని ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఓ ఆ ప్రకటనలో కోరారు.