అన్నవరంలో ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు సస్పెండ్..


Ens Balu
9
Annavaram
2021-09-12 12:33:02

అన్నవరం రత్నగిరి క్షేత్రంపై పనిచేస్తున్న ప్రధాన అర్చకుడు ఎస్.హరిగోపాల్, ఉప ప్రధాన అర్చకులు కె.సుబ్రహ్మణ్యంలను ఈఓ వేండ్ర త్రినాధరావు సస్పెండ్ చేశారు. ఈమేరకు ఆదివారం అన్నవరంలో దేవస్థానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన అర్చకు, ఉప ప్రధాన అర్చకుడు  విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో  ఫిర్యాదు అందుకొని వారిపై నిఘాపెట్టామన్నారు.  విచారణలో వాస్తవాలు గుర్తించడంతో ఇద్దరు అర్చకులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు ఈఓ మీడియాకి తెలియజేశారు. అయితే ఈ విషయం సాయంత్రం వరకూ బయటకు రాలేదు. దేవస్థానంలోని అధికారులుగా ప్రచారం జరిగినా, సిబ్బంది కాదని అర్చకులనే సస్పెండ్ చేసినట్టు ఈఓ వివరించారు. అర్చకులను సస్పెండ్ చేయడం అన్నవరం కొండపై కలకలం స్రుష్టించింది. గతంలో పలు మార్లు హెచ్చరించినా వినకపోవడం, ఫిర్యాదులు, నిర్లక్ష్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఈ చర్యలకు ఉపక్రమించినట్టు ఈఓ తెలియజేశారు.

సిఫార్సు