మన్యంలో వేక్సినేషన్ పరిశీలించిన పీఓ..


Ens Balu
3
Paderu
2021-09-12 12:33:58

విశాఖఏజెన్సీ లోని 11మండలాలలో 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఈరోజు నుంచి కోవిడ్ వేక్సినేషన్ అందరికీ వేయించాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ రోణంకి తెలిపారు. ఆదివారం పాడేరు మండలం వంట్ల మామిడి మరియు మినుములూరు  సబ్ సెంటర్లలలో , మరియు మినుములూరు గ్రామ సచివాలయంలోవాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల వున్న గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులందరికీ వాక్సిన్ వేయించాలని ఈరోజు నుంచి వాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రతీ ఒక్కరికీ వాక్సిన్ అందేలా చూడాలని పిఓ తెలిపారు. గిరిజన గ్రామాల్లో పిహెచ్ సి పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు,ఎఎన్ఎమ్ లు మరియు మెడికల్ సిబ్బందిని  గ్రామాలకు పంపించి వాక్సిన్ గురించి వివరించి ప్రజలకు తెలపాలని ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులను ఆదేశించారు. 11మండలాలో ప్రతీరోజు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఎంతమంది కి వాక్సిన్ వేసారో వివరాలను గంటగంటకు తమకు రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు. 

సిఫార్సు