తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్టు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విపత్తు నియంత్రణ అధారిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసకున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. అయినప్పటికీ దవళేళ్వరం చెట్టు ప్రక్కల ప్రాంతాల్లోని గ్రామాలు, కాలువ ఆధారిత ప్రాంతాల్లో మెడికల్, రెవిన్యూ సిబ్బంది సర్వెలెన్స్ మాత్రం కొనసాగుతుందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా సచివాలయాలకు సమాచారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.