స్పీడు పెంచిన అన్నవరం దేవస్థాన ఈఓ..
Ens Balu
3
Annavaram
2021-09-13 05:17:28
అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం విధినిర్వహణలో కాస్త దూకుడు పెంచారు. గాడితప్పుతున్న ఆలయ సాంప్రదాయాలను, సిబ్బంది చేతవాటాలను కట్టడని చేసేందుకు నడుం బిగించారు. ఏకంగా దేవస్థానంలోని స్వామివారికి పూజలు నిర్వహించే ప్రధాన అర్చకుడు, ఉప ప్రధాన అర్చకులనే సస్పెండ్ చేశారంటే దేవస్థానంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందోఅర్ధం చేసుకోవచ్చు. దేవస్థానంలో ఏం జరుగుతుందని రాష్ట్రస్థాయిలో అధికారులు ప్రశ్నించడానికి ముందుగానే ఈఓనే రంగంలోకి దిగి ప్రత్యేక ఏరివేత కార్యక్రమానికి ఉపక్రమించారు. తప్పుచేస్తే ఎంతడివాడినైనా ఇంటికి పంపిస్తాననే చెప్పే క్రమంలో ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేసి ట్రెండ్ స్రుష్టించారు. వాస్తవానికి దేవస్థానాల్లో ప్రధాన అర్చకులను సస్పెండ్ చేయడమంటే కాస్త కత్తిమీద సాముతో కూడుకున్న పని. కానీ దేవస్థాన ప్రతిష్టకు భంగం వాటిల్లితే..దానికి కారకులు ఎంతటి వారైనా ఉపేక్షించనని ఇద్దరు అర్చకుల సస్పెండ్ మొత్తం ఆలయంలోని అధికారులు సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. దానికితోడు స్వామివారికి సంబంధించిన సమాచారాన్ని భక్తులకు చేరవేసే విషయంలో ద్రుష్టిపెట్టని ఆలయ అధికారులు, సిబ్బంది, వారికి ఆదాయం వచ్చే విషయాలను ఒక రింగ్ లా ఏర్పాటై చాపకింద నీరులా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీనితో స్వామివారికొచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఈఓ ఆదిలోనే ఈ మామూళ్లు, అడ్డదారి ఆదాయ వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకొని ఒకరిద్దరు పెద్ద తలకాయలను ఆధారాలతో సహా సస్పెండ్ చేస్తే గాడిలో పడరని ఈఓ భావించి.. ఆవిధంగా చర్యలకు ఉపక్రమించడం ఇపుడు దేవస్థానంలో చర్చనీయాంశం అయ్యింది. స్వామివారి ఆలయంలో ప్రధాన, ఉప ప్రధాన అర్చకులనే సస్పెండ్ చేశారంటే మనమెంత అనే ప్రచారం.. అర్చకులను సస్పెండ్ చేసిన వెంటనే దేవస్థానంలో గుప్పుమంది. అయితే వార్నింగ్ కోసమే ఈ సస్పెండ్ లు చేసి ఊరుకుంటారా లేదంటే అన్ని విభాగాల్లోనూ ప్రక్షాళన చేపడతారా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది.