శంఖవరం మండలంలో భూముల రీ-సర్వేలో భాగంగా రికార్డుల స్వచ్ఛీకరణ జరుగుతోందని తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం శంఖవరం తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ధేశించి 6రకాల ఫార్మాట్ లలో రికార్డుల పరిశీలన జరుగుతుందన్నారు. మొత్తం రికార్డుల పరిశీలన పూర్తయిన తరువాత సర్వేయర్లు భూములు రీసర్వే చేపడతారని అన్నారు. 32 రెవిన్యూ గ్రామాల్లో 32వేల622 ఎకరాలు(పోరంబోకు, ప్రైవేటు, ప్రభుత్వ, గ్రామకంఠాలు) భూమి వుందన్నారు. ప్రస్తుతం 70 ఏళ్ల క్రితం నాటి రికార్డులు పరిశీలన జరుగుతుందన్నారు.