జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటా..


Ens Balu
3
Paravada
2021-09-15 14:52:35

విశాఖలోని పెందుర్తి నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులకు తాను నిరంతరం అండగా ఉంటానని, వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పరవాడ యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులందరికి తన సొంత నిధులతో ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక జాబితాను రూపొందించామన్నారు. పరవాడలో జర్నలిస్టుల కాలనీలో అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంకా పెండింగ్ ఉన్న జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. దీంతో పాటు అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు హెల్త్  ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఫెడరేషన్ పరవాడ యూనిట్ కు సంబంధించి తాను తన వంతు సహకారం అందిస్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులకు తాను అన్ని వేళల అందుబాటులో ఉంటానన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను విపులంగా తెలియజేయడం జరిగిందన్నారు. అర్హులందరికి అక్రిడేషన్లు జారీ చేయాలని, వాటితో పాటు ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని కోరామన్నారు. విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి. నారాయణ మాట్లాడుతూ ఫెడరేషన్ అనుబంధంగా పరవాడలో జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే జిల్లాలోని సర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అరుకు, పాడేరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ తమ అనుబంధ అసోసియేషన్లు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చె వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ యూనిట్ అధ్యక్షులు లాలం కృష్ణారావు, కార్యదర్శి పైలా సన్యాసినాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆర్.గోపి, కార్యదర్శి జి.మోహనరావు తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జెడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లతో పాటు జాతీయ సభ్యులు జి.శ్రీనివాసరావు, ఏపి బ్రాడ్ క్రాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి) బి. ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్, గాజువాక నుంచి పితాని ప్రసాద్ తదితరులంతా పాల్గొన్నారు.

 
మృతి చెందిన జర్నలిస్టులకు ఘన నివాళులు:
తొలుత కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టులు ప్రకాష్, కారునాయుడుల మృతికి ఘనంగా నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యత్వ కార్డులను సభ్యులకు ఎమ్మెల్యే చేతులు మీదుగా అందజేసి ఘనంగా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా పరవాడ ఆంధ్రప్రభలో సేవలందిస్తూ మృతి చెందిన పాత్రికె యుడు ప్రకాష్ సతీమణికి రూ.25వేలు ఎమ్మెల్యే సొంత నిధులను అందజేశారు. ఇప్పటికే మరికొందరికి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సిఫార్సు