పాఠశాలల అభివ్రుద్ధి చరిత్రగా నిలిచిపోతుంది..


Ens Balu
7
Sankhavaram
2021-09-15 15:01:06

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మనబడి - నాడు నేడు పధకం  కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో ఆధునిక సాంకేతికత, సౌకర్యాలకు ఓ వరవడిగా మారిందని కాకినాడ ఎంపీ వంగాగీత పేర్కొన్నారు. బుధవారం శంఖవరం మండలంలోని మనబడి... నాడు -నేడు పధకం తొలి విడత అభివ్రుద్ధఇ కార్యక్రమాలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, ఎంపీ వంగా గీతతో కలిసి నూతనంగా పునఃప్రారంభం చేసి ప్రజలకు అంకితం చేశారు. ఇందులో భాగంగా మండలంలోని అన్నవరం, గొంధి కొత్తపల్లి, అచ్చంపేట, నెల్లిపూడి పంచాయితీ శివారు తిరుపతి అగ్రహారం, కొంతంగి కొత్తూరు, అన్నవరంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, కత్తిపుడిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, దీని సమీపంలోని ఈబీసీ కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు మన బడి - నాడు నేడు పధకంలో వివిధ నవీకరణ అభివృద్ధి పనులను వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎంపీ మాట్లాడుతూ, పాఠశాలల విద్య, అంగన్వాడీ విద్య, మహిళా సాధికారత, మహిళా శక్తి సంఘాల బలోపేతం, లాభసాటి ఆర్ధిక లావాదేవీల నిర్వహణపై ఆమె కూలంకషంగా మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్ధులకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయిని మించిన వాతావరణ కలుగజేయడంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. జగన్న విద్యా కానుకలనూ, ఆక్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువులనూ విద్యాశాఖ తరఫున విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంఖవరం ఎంఈఓ సూరిసెట్టి వేంకటరమణ, ఎంపీడీఓ జె.రాంబాబు, గొంధి కొత్తపల్లి సర్పంచ్  ఈగల విజయదుర్గ, అచ్చంపేట సర్పంచ్ బొట్టా చైతన్య, ఎస్.జగ్గంపేట సర్పంచ్ బైరా ఉప్పారావు, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, కత్తిపూడి సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, శంఖవరం మండల పంచాయితీల వార్డు సభ్యుల సంఘ అధ్యక్షుడు గౌతు వాసు, ది కత్తిపూడి కర్షకసేవా సహకార సంఘం మాజీ అధ్యక్షుడు గౌతు సుబ్రహ్మణ్యం (నాగు), ఆయా పాఠశాల అభివృద్ధి సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు