దోమల నియంత్రణకు గంభూషియా విడుదల..
Ens Balu
4
Sankhavaram
2021-09-16 16:28:01
దోమల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శంఖవరం సర్పంచ్ బి. గన్నియ్యమ్మ, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ అన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని మురుగునీటి కాలువల్లోని దోమల లార్వానియంత్రణకు గంభూషియా చేపలను విడిచి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రభలుతున్నవేళ దోమలను నియంత్రించడానికి పంచాయతీ అన్నివిధాల క్రుషి చేస్తుందన్నారు. అదే సమయంలో కాలువల్లో ఎవరూ చెత్తవేయకూడదని సూచించారు. ప్రతినిత్యం ప్రత్యేక శాణిటేషన్ డ్రైవ్ కూడా చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంబాబు, జూనియర్ సహాయకులు రమణమూర్తి, పంచాయతీ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పడాల భాష తదితరులు పాల్గొన్నారు.