మానవత్వం చాటుకున్న నూతన జెడ్పీటీసీ..
Ens Balu
3
Golugonda
2021-09-20 09:18:00
గొలుగొండ జెడ్పీటీసీ గిరిబాబు (ప్రధమ చికిత్స వైద్యుడు) ప్రమాదంలో గాయపడిన వారికి ప్రధమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నారు. సోమవారం జెడ్పీటీసీగా గెలుపొందిన అధికారిక పత్రం తీసుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఒక యువకుడు ప్రమాదవసాత్తు బైక్ పై నుంచి కింద పడిపోయాడు. వెంటనే క్షతగాత్రుడి దగ్గరకు వెళ్లి ప్రాధమిక చికిత్స అందించారు. ఆపదలో ఎల్లప్పుడు ముందుండే ఈయన తన చేతిలో వున్న ప్రాధమిక వైద్యాన్ని క్షగాత్రులకు అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి దగ్గరుండి తరలించారు. జెడ్పీటీసీ చేసిన సహాయానికి గొలుగొండ ఎస్ఐ, వైఎస్సార్సీపీ నాయకులు అభినందనలు తెలియజేశారు.