రైతులకు ఆర్బీకేల ద్వారా పూర్తిసేవలందాలి..
Ens Balu
5
Denkada
2021-09-21 12:15:56
డెంకాడ మండలం పినతాడివాడలోని రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ-క్రాప్ నమోదుపై ఆరా తీశారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. గ్రామంలోని పంటల పరిస్థితిపై, విఆర్ఓను వివరాలు అడిగారు. ఎరువులు, పురుగుమందుల సరఫరా గురించి సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలోని సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, ల్యాబరేటరీలు, ఇతర సదుపాయాల గురించి ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు. పాఠశాలలో నెలకొన్న త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.