మీ ఇల్లయితే ఇలా అపరిశుభ్రంగా ఉన్నా ఇంట్లోనే ఉంటారా.. అసలు సచివాలయాన్ని నిర్వహించే పద్దతి ఇదేనా.. ఎక్కడ చెత్త అక్కడే..ఎక్కడి దుమ్ము అక్కడే వుంది.. కనీసం సచివాలయం ముందు బ్లీచింగ్ కూడా చల్లించడం లేదు..అంటూ జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ విరవ గ్రామ సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో తనిఖీలు చేసిన కలెక్టర్ కి అక్కడి సిబ్బంది విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు వందలాది మంది సచివాలయానికి వస్తారు..బ్లీచింగ్ చల్లించడం వలన పరిశుభ్రంగా కనిపిస్తుంది..కనీసం అలా కూడా ఎందుకు ఆలోచిండచం లేదు..పోనీ విధులైనా సక్రమంగా నిర్వహిస్తున్నారా అదీలేదూ అంటూ విరవ గ్రామసచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో అక్కడ అపరిశుభ్రవాతావరణం కనిపించడంతో ఒక్కపెట్టున కలెక్టర్ సిబ్బందిపై నిప్పులు కక్కారు. ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు, అనర్హుల వివరాల జాబితాలను సక్రమంగా నిర్వహించక పోవడం, సచివాలయం ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ సచివాలయం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన సచివాలయం భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి అక్టోబర్ నెలాఖరు నాటికి ప్రారంభించి, వినియోగంలోకి తెచ్చేలా విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున రైతు భరోసా కేంద్రం, బల్క్ మిల్క్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణ పనులను కూడా ముమ్మరం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పిఠాపురం ఎంపీడీవో డీఎల్ఎస్.శర్మ, ఇతర రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.