గ్రామ వలేంటీర్లు తమ పరిధిలో గల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించే లా విధులు నిర్వహించాలి అని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ బుధవారం తన పర్యటనలో భాగంగా జియ్యమ్మ వలస మండలం ఇట్టిక, కొమరాడ మండలం మాదలింగి, పాలెం గ్రామ సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయం సిబ్బంది, వాలెంటిర్లకు సీజనల్ వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు. పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. కొమరాడ మండలం మాదలింగి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మండగి సింహాచలం రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి పై తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సచివాలయం ఆకస్మిక పర్యటనలో జియ్యమ్మ వలస, కొమరాడ మండలాల రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.