ఆక్రమణ స్థలం క్రమబద్దీకరణ కోసం.. చెరువు గర్భంలో సచివాలయం


Ens Balu
1
ఎస్.రాయవరం
2020-09-11 12:41:53

కాదేదీ కోర్టు దిక్కారణకు అనర్హం... కాదేదీది ఆక్రమణలకు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు చెరువు గర్భం.. అధికారులు చేతిలో వుంటే చెరువు గర్భంలోనేకాదు ...ఏకంగా చెరువులోనే గ్రామసచివాలయ భవనాలు నిర్మించొచ్చు. లాయరు నోటీసులు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేయొచ్చు...సరిగ్గా అలాగే జరుగుతుంది ఎస్.రాయవరంలోని కొత్తగా మంజూరైన ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్న మండల అధికారుల తీరు. ప్రభుత్వం గ్రామసచివాలయం, వెలనెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు రూ.75 లక్షలు ఎస్.రాయవరం గ్రామపంచాయతీకి కేటాయించింది. కాగా అధికారపార్టీకి చెందిన నేతలు అధికారులను ప్రసన్నం చేసుకొని, ఆ నిర్మాణాలు కాస్త గ్రామంలో కేటాయించిన ఎస్.రాయవరంలో కాకుండా, పక్క రెవిన్యూ గ్రామమైన కర్రివానిపాలెం రెవిన్యూ విలేజిలోని చెరువు గర్భంలో నిర్మిస్తున్నారు. వాస్తవానికి చెరువు గర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడని ఇప్పటికై హైకోర్టులో ప్రభుత్వ వాదనలు నడుస్తున్నాయి. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, గ్రామంలోకాకుండా మరొక రెవిన్యూ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై స్థానికులు కోర్టు నోటీసులు ఇటు జిల్లా పంచాయతీ అధికారికి, స్థానిక ఎంపీడీఓ, గ్రామ సచివాలయానికి పంపారు. అయినప్పటికీ వాటిని పక్కనపెట్టి యధేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే విషయమై లాయరు నోటీసు అందుకున్న జిల్లా పంచాయతీ అధికారి(తేది 18-8-2020న) స్థానిక ఈఓపీఆర్డీకి చెరువు గర్భంలోని నిర్మాణాల విషయమై విచారణ చేసి నివేదిక పంపాలని, లాయరు నోటీసుకి బదులు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, నిర్మాణాలన్నీ సజావుగానే సాగుతున్నట్టుగా జిల్లా అధికారులను నమ్మించారు స్థానిక అధికారులు. అసలు మంజూరైన గ్రామంలో కాకుండా కర్రివానిపాలెం రెవిన్యూ విలేజిలో చెరువు గర్భంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం చేపడుతున్న నిర్మాణాలు ఏవిధంగా చేస్తున్నారు, ఏ అధికారంతో చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకొని చేస్తున్నారు, అసలు గ్రామంలో కాకుండి పక్క రెవిన్యూ గ్రామంలో ఎందుకు చేస్తున్నారు? ఇలా చాలా అనుమానాలే ఉన్నాయిక్కడ. అంతేకాదు ఎవరు వెళ్లి చూసినా ఇక్కడ ప్రభుత్వాన్ని, అటు కోర్టు ఆదేశాలను దిక్కరిస్తున్నారని అర్ధమవుతుంది.  అధికారపార్టీచెందిన నేతలు అదే ప్రాంతంలో కొన్ని స్థలాలు గతంలోనే ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే ప్రాంతలో చేపడిపతే తమ ఆస్తులన్నీ క్రమబద్ధీకరణ జరుగుతాయనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ నిర్మాణాలపై అధికారులు కనీసం విచారణ చేపట్టకపోవడం, నిబంధనలకు విరుద్దంగా గ్రామంలో కాకుండా ఈ రెవిన్యూ గ్రామంలోని చెరువు గర్భంలో నిర్మాణాలు యధేచ్ఛగా చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రారంభంలో ఉన్న నిర్మాణాల చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయని న్యాయవాది అన్నపూర్ణయ్య ఈ నోటీసులు పంపారు. నోటీసు బుట్టదాఖలై ప్రభుత్వ కార్యాలయాలు మంజూరైన గ్రామంలో కాకుండా పక్క గ్రామంలో యధేచ్చగా సాగిపోతున్నాయి. ఎప్పుడైనా భారీ వరదలు వస్తే గ్రామంలోని నిరు, చుట్టు ప్రక్కల ప్రాంతాల నీరు ఈ నిర్మాణాలనే తాకుతుంది అయినప్పటికీ, ఆ విషయాలను పట్టించుకోకుండా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారు. మరి ఈ నిర్మాణాలపై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి...