ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేర్చాలి..


Ens Balu
3
Chodavaram
2021-09-24 12:33:17

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి  చేరేవిధంగా విధులను నిర్వహించాలని జిల్లాకలెక్టర్  డా.ఎ.మల్లిఖార్జున  సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.  శుక్రవారం చోడవరం మండలంలో ఆకస్మిక పర్యటన చేసి గ్రామ సచివాలయాలు, అంగన్ వాడి కేంద్రాలు, జిల్లా పరిషత్ హైస్కూల్,  ఎం .పి.పి. ఎలిమెంటరీ స్కూల్, పి.హెచ్.సి.లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ వెంకన్నపాలెం, గోవాడ గ్రామ సచివాలయాలను  సందర్శించి అక్కడి సిబ్బందితో  మాట్లాడారు. కార్యాలయ  రిజిష్టర్లను పరిశీలించారు.  ప్రభుత్వ సేవలు కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా వారి అర్జీలను పరిశీలించి పెండింగ్ లేకుండా  నిర్దేశిత సమయంలో  పరిష్కరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి  ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. అక్కడ గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  అందుకు గ్రామస్దులు కలెక్టర్ తో సింగిల్ రైస్ కార్డులు సక్రమంగా ఇవ్వడం లేదని దానివలన పించన్లు ఆగిపోతున్నాయని, అదే విధంగా పాస్ బుక్ ల కొరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటున్నామని  అవి కూడా సరియైన సమయానికి  ఇవ్వడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు.  వెంటనే కలెక్టర్ సంబందిత తాసీల్దార్, ఆర్.డి.ఓ లతో వారి సమస్యలను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. చెరువుకు సంబందించిన భూమిలో జగనన్న కాలనీ  లేఅవుట్ లను వేసారని ఫిర్యాదు చేయగా దానిపై ఎంక్వరీ చేయాల్సిందిగా  ఆర్.డి.ఓ ను ఆదేశించారు. సచివాలయ పరిధిలో 18-45 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్   వేసినది లేనిది అడిగి తెలుసుకున్నారు.  నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.  
నాడు –నేడు పథకంలో భాగంగా పంచాయితీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా సంబందిత అధికారులను ఆదేశించారు.  అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ పిల్లలతో  మాట్లాడారు.  అదే విధంగా జెడ్ పి ఉన్నత పాఠశాల మరియు ఎం .పి.పి. మెయిన్ ఎలిమెంటరీ స్కూల్ సందర్శించి  జగనన్న విద్యాకానుక కిట్ ను పరిశీలించారు.  అన్ని సక్రమంగా అందినవి లేనివి అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నది లేనిది ఆరా తీసారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఖాళీల వివరాలను అడిగారు.  నాడు – నేడు పనులను పరిశీలించారు. పాఠశాలలో టాయిలెట్స్, నిరంతర నీటి సౌకర్యం ఉన్నది, లేనిది పరిశీలించారు. హైస్కూల్ లో 10వ తరగతి వరకు మాత్రమే ఉన్నదని, ఇంటర్ మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేయాలని విద్యార్ధులు కోరగా పరిశీలించి ప్రభుత్వానికి తెలియజేస్తామని  కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖి చేసారు. వార్డులను పరిశీలించి,  గర్భిణీలు, బాలింతలతో మాట్లాడి  వారి కేస్ షీట్ లను పరిశీలించారు. ఆరోగ్య శ్రీ పథకం  వారికి వర్తింప చేస్తున్నది లేనిది డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపద్యంలో డెంగ్యూ, మలేరియా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గోవాడ సుగర్ ప్యాక్టరీని సందర్శించి  సిబ్బందితో మాట్లాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పర్యటనలో ఆర్.డి.ఓ సీతారామారావు, తాసిల్దార్ తిరుమల బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

సిఫార్సు