జోరు వానలోనూ.. జాలర్ల రక్షణ కోసం..


Ens Balu
3
Chintapalli Beach
2021-09-26 07:39:39

ఓపక్కజోరు వర్షం.. మరో పక్క భారీ తుపాను హెచ్చరికలు.. తీర ప్రాంత మంతా అలజడిగా వుంది.. ఇలాంటి తరుణంలో ఏ ఒక్కరికీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు.. అనుకున్నదే తడవుగా అన్ని తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను దగ్గరుండి మరీ హెచ్చరిస్తున్నారు విజయనగరం జిల్లా ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి.. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశాలతో..  తీర ప్రాంతాలను తన సిబ్బంది, పోలీసుల సహాయంతో  రెండురోజులుగా జల్లెడ పడుతున్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ మత్స్యకారులకు దైర్యం చెబుతున్నారు. ఆదివారం చింతపల్లి ప్రాంతంలో స్థానిక పరిస్థితిని స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. అక్కడి సమాచారాన్ని  జిల్లా కేంద్రంతోపాటు, రాష్ట్రకార్యాలయానికి సమాచారం పంపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, భారీ తుపాను హెచ్చరికతో మత్స్యశాఖ పరంగా అన్ని ప్రాంతాల్లోని ఎఫ్డీఓలను, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను అప్రమత్తం చేశామన్నారు. రేపటి వరకూ మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు చెప్పారు. పునరావస కేంద్రాలను సిద్ధం చేశామని, అదేవిధంగా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా గ్రామ సచివాలయాల ద్వారాసమాచారం అందించాలని స్థానిక సిబ్బందికి సూచించినట్టు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బందితోపాటు పోలీసులు పాల్గొన్నారు.
సిఫార్సు