కమ్యూనిటీహాలు నిర్మాణానికి సహకరించండి..


Ens Balu
3
Annavaram
2021-09-26 08:34:05

అన్నవరం మేజర్ పంచాయతీలోని వెలమ,శెట్టిబలిజి సామాజిక వర్గం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సహకరించాలని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణను కోరారు. ఆదివారం అన్నవరం సత్యదేవుని దర్శనార్ధం వచ్చిన మంత్రిని ఈ మేరకు సర్పంచ్ ప్రత్యేకంగా వెళ్లి కలిసి కమ్యూనిటీ భవనం కోసం మాట్లాడారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన మీడియాకి తెలియజేశారు. అన్నవరంలో వెలమ,శెట్టిబలిజి సామాజిక వర్గం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అన్నివర్గాల మద్దతుతోపాటు ప్రభుత్వ సహాయ సహకారాలు కోరినట్టు ఆయన చెప్పారు. ఆయనతోపాటు పలువురు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
సిఫార్సు