వజ్రపుకొత్తూరు మండలంలోని 182 మంది తరలింపు..


Ens Balu
3
Vajrapukotturu
2021-09-26 11:54:07

శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలంలోని 182 మందిని వివిధ తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదివారం వెల్లడించారు. గులాబ్ తుఫాను కారణంగా మండలంలోని లోతట్టు ప్రాంత ప్రజలను తుఫాను పునరావాస కేంద్రాలకు తరలింపు కార్యక్రమం చేపట్టారు. ఇందులో మంచినీళ్ళపేట గ్రామంలో 12 మందిని, బైపల్లి గ్రామానికి చెందిన 54 మందిని, ఎల్.డి. పేట గ్రామానికి చెందిన 26 మందిని ఆయా గ్రామాలలోని మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.  మెట్టూరు గ్రామానికి చెందిన 65 మందిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించగా, పూడిలంక గ్రామంలోని 73 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు.
సిఫార్సు