ప్రముఖ పర్యాటక కేంద్రం అందాల అరకులోయ లో పర్యాటక సమాచార కేంద్రాన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల క్రిష్ణ ప్రాంభించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక మ్యూజియం లో పర్యాటక సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. పర్యాటకులకు ఏకో టూరిజం వెబ్ సైటును ప్రారంభించారు. ఐటీడీఏ సౌజన్యం తో ఏర్పాటు చేసిన పెడలబుడు,కొల్లాపుట్టు కాటేజీలను ఆన్లైన్ విధానంలో అరకు ఏకోటూరిజం డాట్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని పి.ఓ తెలిపారు. అనంతరం ఐటీడీఏ ద్వారా శిక్షణ పొంది ఏర్పాటు చేసిన హస్త కళల స్టాళ్లను ఆయన సందర్శించి చెక్కతో చేసిన లక్కబొమ్మల కిట్లను ఆయన ప్రారంభించారు. లక్కబొమ్మల కిట్లను ఏజెన్సీలోని పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తామని దిశ వెల్ఫేర్ సొసైటీ కో ఆర్డినేటర్ జయశ్రీ హట్టంగడి తెలిపారు. రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సి.వి రాజును గిరిజన నిరుద్యోగ యువతకు లక్కబొమ్మల తయారీలో శిక్షణ అందించాలని పిఓ కోరారు. ఈ సందర్భంగా 100మందితో ఏర్పాటు చేసిన దిమ్సా నృత్యం తిలకించారు. ఈకార్యక్రమంలో మ్యూజియం క్యురేటర్ మురళి తదితరులు పాల్గొన్నారు.