ఏజెన్సీలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచ్చివాలయ వ్యవస్ధ ద్వారా ప్రజలకు వివిధ రకాల సీవలందించేందుకు గ్రామ సచివాలయ నూతన భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు సంబందించిన పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబందిత ఇంజినీర్లను, కాంట్రాక్టర్లను రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య సంబందిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గంగవరం మండలం కొత్తాడ, పిడతమామిడి, లక్కొండ, నెల్లిపూడి, మొల్లేరు గ్రామాలలోని గ్రామ సచివాలయాల నూతన భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రాజెక్టు అధికారి ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ఏజెన్సీలోని 120 గ్రామ పంచాయితీ సచివాలయాల పరిధిలోని వివిధరకాల సేవలు ప్రజలకందించేందుకు, ఫైబర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతీ గ్రామ సచివాలయాల ద్వారా వివిధ రకాల సేవలు అందించేందుకు గ్రామ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, అందుకు ఈ నూతన గ్రామ సచివాలయ నూతన భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు సంబందించిన పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకోచ్చేవిధంగా ఈ నూతన భవనాలకు, నిబందనల ప్రకారం పూర్తిస్ధాయిలో పనులు పూర్తిచేయించాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. ప్రాజెక్టు అధికారి వారి వెంట ఎ.ఇ. శ్రీలత, జె.ఇ. అబ్బాయిదొర తదితరులు పాల్గొన్నారు.