నర్సీపట్నం మండలంలో దార్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపైనే అధికంగా ద్రుష్టికేంద్రీకరించి పరిష్కారానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని ఎంపిపి సుర్ల రాజేశ్వరి అన్నారు. నర్పీపట్నంలో శుక్రవారం ఆమె ఎమ్మెల్యే సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన ఎంపిపికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎంపీడీవో జయమాధవి, వైసిపి నేత నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడుతో పలువురు అధికారులు అనధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాజేశ్వరి మాట్లాడుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ముఖ్యంగా మండలంలోని ఎంపీటీల పరిధిలోని ప్రధాన సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. తనకు ఈ పదవి అప్పగించి ఎమ్మెల్యేకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.