పశువుల టీకాలు సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
3
Annavaram
2021-10-01 09:45:10
ప్రభుత్వం పాడి రైతుల సౌకర్యార్ధం అందజేస్తున్న ఉచిత పశువుల టీకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కోరారు. శుక్రవారం అన్నవరం గోశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశువులకు వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి వాటిని పశువైద్యులు, సిబ్బందికి తెలియజేయడం ద్వారా ప్రభుత్వ పశువైద్య కేంద్రాల ద్వారా ఉచితంగానే వైద్యసేవలు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు, ఎంపీపీ పర్వత గుర్రాజు, సర్పంచ్ కుమార్ రాజా, పశువైద్యాధికారి డా.వీరరాజు, డా.టి.లావణ్య, డా.కె. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు గోపూజ నిర్వహించారు.